|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:25 PM
టాలీవుడ్ నటి, మాజీ మంత్రి రోజా తన కూతురు అన్షు మాలిక పెళ్లి, సినీ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందించారు. తమ కుటుంబం గురించి వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని, అన్షు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనుందన్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. అన్షు సైంటిస్ట్ కావాలని కలలు కంటోందని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులపై దృష్టి సారించిందని రోజా తెలిపారు. పిల్లల పెంపకంలో స్వేచ్ఛనిస్తానని, అన్షుకు నటనపై ఆసక్తి ఉంటే ప్రోత్సహిస్తానని, కానీ ప్రస్తుతం చదువుకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు.
Latest News