|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:30 PM
వచ్చే వారం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్‌లో పలు సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో చిరంజీవి, ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాలకు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణలో పరిస్థితిపై చర్చ జరుగుతోంది. ఇటీవల 'అఖండ-2' సినిమాకు టికెట్ ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ప్రభుత్వం వద్దకు రావద్దన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వంతో ఎవరు చర్చలు జరుపుతారనేది ఆసక్తికరంగా మారింది.
Latest News