|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 12:23 PM
నటి వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనకు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమ్మతనం ఒక పెద్ద బాధ్యత అని, కేవలం పిల్లల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరని వెల్లడించారు. తాను తన చెల్లికి తల్లిగా ఉంటానని అన్నారు. అలాగే తన పెంపుడు కుక్కలకు తల్లిగా వ్యవహరిస్తానని, స్నేహితులను తల్లిగా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. సహాయం అవసరమైన వారికి తల్లిలా తోడుంటానని తెలిపింది. వ్యక్తిగతంగా పిల్లల్ని కనే ఆలోచన లేదని అన్నారు.
Latest News