|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 03:06 PM
‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ, సింగర్ చిన్మయి వంటి వారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయితే, ఆ సందర్భంలో వేదికపై ఆయన పక్కన ఉన్న మరో నటుడు నవదీప్ ఎందుకు మౌనంగా ఉన్నారు, శివాజీని ఎందుకు ఆపలేదు అనే ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. వీటికి ఆయన సమాధానం ఇచ్చారు. 'దండోరా' సక్సెస్ మీట్‌లో విద్యార్థులతో జరిగిన చిట్ చాట్‌లో నవదీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి నేరుగా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... “వేదికపై ఒక వ్యక్తి తన అభిప్రాయాలను పంచుకుంటున్నప్పుడు మధ్యలో అడ్డుపడటం సరైనది కాదు. అది సంస్కారం అనిపించదు. శివాజీ గారు పరిశ్రమలో నాకు కంటే చాలా సీనియర్, 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఆయనకు ఒక విషయంపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే ఆ సమయంలో నేను మౌనంగా ఉన్నాను. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది” అని చెప్పారు.
Latest News