|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 02:42 PM
మోహన్ లాల్ ఈ తరం హీరోలతో పోటీపడుతూ, వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేయడం ఆయన సినిమాలకు అలవాటైపోయింది. అలాంటి మోహన్ లాల్ నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'వృషభ' వచ్చింది. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన మలయాళ .. తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు చేశారు. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచే కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అంచనాలన్నీ ఒక్కసారిగా తలక్రిందులైపోయాయి. మలయాళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా తొలి రోజున 70 లక్షలను మాత్రమే రాబట్టగలిగింది. మోహన్ లాల్ సినిమా తొలిరోజున ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడం చర్చనీయాంశమైంది. ఇంతవరకూ ఈ సినిమా 10 కోట్లకి పైగా మాత్రమే వసూలు చేయగలిగిందని ఆంటున్నారు.
Latest News