|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 03:01 PM
సినీనటి మాధవీలతపై హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలతోపాటు మరో 13 మంది సాయిబాబాపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ షిర్డీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సాయిబాబా, సాయిబాబా మందిరాలపై విషప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని నవంబర్ నెలాఖరులో ఫిర్యాదు అందినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం అనుమతి తీసుకుని తాజాగా కేసు నమోదు చేశారని సమాచారం. ఈ అంశంపై ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ ‘సాయిబాబాపై దేవుడే కాదు’ అంటూ మాధవీలత, మరికొందరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలుగా ప్రచారం చేస్తున్నట్టుగా షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ్‌గుప్తా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Latest News