|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 02:57 PM
1990లలో వరుస హిట్లు ఇచ్చిన హీరో వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ తనయుడే నవీన్. సొంత బ్యానర్లో భారీ విజయలను అందుకున్న రమేశ్, ఆ తరువాత తన తనయుడు నవీన్ ను హీరోగా పరిచయం చేశారంటూ, ఆనాటి సంగతులను దర్శకుడు నందం హరిశ్చంద్రరావు పంచుకున్నారు. నవీన్ కెరియర్ ను గురించి ఆయన ప్రస్తావించారు."నేను వడ్డే రమేశ్ .. దాసరిగారు కలిసి చేసిన సినిమాలకి పనిచేశాను. అందువలన నవీన్ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు" అని ఆయన అన్నారు. "వడ్డే నవీన్ ను హీరోగా చేయాలని తండ్రి అనుకోలేదు .. అది నవీన్ ఇంట్రెస్ట్. అతను వచ్చి అడిగిన తరువాతనే రమేశ్ గారు ఆ విషయాన్ని గురించి ఆలోచన చేశారు. నవీన్ కి శిక్షణ ఇప్పించారు. నవీన్ కూడా చాలా కష్టపడి డాన్సులు .. ఫైట్లు నేర్చుకున్నాడు. అతనిని నేను ప్రతిరోజూ చూస్తూ ఉండేవాడిని. తొలి సినిమాగా నవీన్ చేసిన 'కోరుకున్న ప్రియుడు' బాగా ఆడింది. ఆ తరువాత చేసిన 'పెళ్లి' .. 'ప్రియా ఓ ప్రియా' సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది" అని అన్నారు. వడ్డే నవీన్ ను ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. అందుకు కారణం ఆయన చేసిన 'స్నేహితులు' .. 'చాలా బాగుంది' వంటి సినిమాలే. డాన్స్ పరంగా కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది. అయితే ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడం మొదలైంది. దాంతో ఆయన గ్యాప్ తీసుకున్నాడు. అడపాదడపా చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు. అలాంటి ఆయన న్యూ ఇయర్లో 'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం" అని చెప్పారు.
Latest News