|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:51 PM
చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం "మన శంకర వరప్రసాద్ గారు" భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ఆయన గతంలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించబడింది.ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార మరియు క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, మరియు సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో పనిచేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.
*బిజినెస్ వివరాలు:ఈ చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ సినిమా, ప్రోమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్లు నుండి 250 కోట్ల రూపాయల మధ్య బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
*తెలుగు రాష్ట్రాల బిజినెస్:ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులు 55 కోట్లు, నైజాం హక్కులు 32 కోట్లు, సీడెడ్ రైట్స్ 18 కోట్లు, కృష్ణా 8.2 కోట్లు, ఉత్తరాంధ్ర 15.3 కోట్లు, గుంటూరు జిల్లాలు 9 కోట్లు విలువైన రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ సాధించడానికి కనీసం 210 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
*ఇండియా బిజినెస్:తెలుగేతర రాష్ట్రాల్లో కర్ణాటక హక్కులు 10 కోట్లు, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం ఆధారంగా, ఇండియాలో 120 కోట్ల రూపాయల బిజినెస్ జరగడంతో, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే కనీసం 240 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమవుతాయి.
*ఓవర్సీస్ బిజినెస్:ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారు 20 కోట్ల రూపాయల మేర విక్రయించబడ్డాయి. అమెరికా, కెనడాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల కోసం కనీసం 5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
*ప్రపంచవ్యాప్తంగా బిజినెస్:ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 260 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ ట్రేడ్ జరిపింది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఈ చిత్రం కనీసం 450 నుండి 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
*శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్:ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 50 కోట్లు అమ్ముడుపోయాయి. ఓటీటీ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా విడుదలకు ముందు నుండే టేబుల్ ప్రాఫిట్ తో బాక్సాఫీస్ ప్రారంభమైంది.
*ట్రేడ్ అంచనాలు:చిరంజీవి కెరీర్‌లో "మన శంకర వరప్రసాద్ గారు" అత్యధికంగా బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఈ సినిమా ఎంత లాభం అందిస్తుందో, వేచి చూడాల్సిందే.చివరగా, ఈ చిత్రం అంచనాలను అందుకుంటే, చిరంజీవి కెరీర్‌లో మరొక హిట్ క్రియేట్ చేయడానికి నాంది పలుకుతుంది.