|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:12 PM
2026 సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్, ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. కుటుంబంతో కలిసి మహేశ్ బాబు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ ఫోటోలలో మహేశ్ బాబు తన కుమార్తె సితార బుగ్గపై ప్రేమగా ముద్దుపెడుతున్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో ఫోటోలో సితార 'న్యూ ఇయర్' అని రాసి ఉన్న హెయిర్‌బ్యాండ్ ధరించి కనిపించింది. ఇంకో చిత్రంలో, నమ్రత తన కుమారుడు గౌతమ్‌తో కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. ఈ పోస్ట్‌కు ఆమె ఓ చక్కటి వ్యాఖ్యను కూడా జత చేశారు. "కృతజ్ఞతతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కుటుంబంతో కలిసి 2026కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని ఆమె పేర్కొన్నారు.
Latest News