|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:45 PM
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నా, చిరంజీవి మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నారని, అందుకే ఆయన ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని టాక్. ఈ విషయాన్ని ఆయన టీమ్ రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Latest News