|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:36 AM
టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్న అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, తాను నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుందని, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐశ్వర్యా రాజేష్ కూడా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని తెలిపారు.
Latest News