|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:37 AM
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తన 38 ఏళ్ల వయసులోనూ సినిమాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. రచయిత రాహుల్ మోడీతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె తన పెళ్లి గురించి స్పందించారు. ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్ లో మాట్లాడుతూ 'నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు ఆమె పెళ్లి ఎప్పుడని ఆరా తీస్తున్నారు. సినిమాల విషయానికొస్తే, శ్రద్ధా చివరగా 'స్త్రీ 2'లో నటించారు. ప్రస్తుతం 'పహడ్‌పాంగిర', 'స్త్రీ 3', 'భేడియా 2', 'ఈతా' సినిమాల్లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Latest News