|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:45 AM
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు తమ తొలి సంతానమైన కుమారుడికి 'విహాన్ కౌశల్' అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7న జన్మించిన వారి బాబుకు రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మా వెలుగు కిరణం విహాన్ కౌశల్. ప్రార్థనలు ఫలించాయి. జీవితం ఎంతో అందమైనది. మా ప్రపంచం ఒక్క క్షణంలోనే పూర్తిగా మారిపోయింది" అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు.
Latest News