|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:07 PM
ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది. సినిమా పైరసీ వెబ్ సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసిన పోలీసులు.. సైబర్ క్రైమ్ చట్టాల కింద ఐదు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న రవి బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రవిపై నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేస్తే రవి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
Latest News