|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 10:55 AM
దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు మనవరాలిగా, సీనియర్ నటి ప్రభకు మనవరాలిగా తన కుటుంబ నేపథ్యాన్ని నటి డింపుల్ హయతి వెల్లడించారు. దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ తో 'కల్కి' అనే సినిమా తీయాలని చివరి కోరికగా పెట్టుకున్నారని, స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని తెలిపారు. అయితే, ఆయన మరణంతో ఆ కోరిక తీరలేదని డింపుల్ హయతి ఎమోషనల్ అయ్యారు. దాసరి నారాయణరావు 150కి పైగా చిత్రాలు తీసి, సామాజిక అంశాలపై సినిమాలు తీసేవారని, ఇండస్ట్రీలో పెద్దగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News