|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 10:31 AM
సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోలు, దర్శకులు సినిమాలు విడుదల చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ సీజన్ లో విడుదలైన సినిమాలు సగటుగా ఉన్నా ఆడేస్తాయని, మంచి లాభాలు వస్తాయని భావిస్తారు. అయితే, ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొమ్మిది చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీటిలో నాలుగు సినిమాలు సంక్రాంతికే విడుదలై కోట్లు గడించాయి. 2019లో 'ఎఫ్ 2', 2020లో 'సరిలేరు నీకెవ్వరు', గత సంక్రాంతికి 'సంక్రాంతి వస్తున్నాం', ఈ సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్ గారు' చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. దీంతో సంక్రాంతి సీజన్ కు అనిల్ ఒక బ్రాండ్ గా మారారు.
Latest News