|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:38 PM
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న ‘రాయుడి గారి తాలుకా’ చిత్రం నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ సంగీతం సమకూర్చారు. గాయని జయశ్రీ ఈ పాటను ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుమన్, కిట్టయ్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Latest News