|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 12:44 PM
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన నటుడు తరుణ్, సినిమాలకు దూరంగా ఉండటంపై ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, తరుణ్‌కు అవకాశాలు రాకనే సినిమాలు మానేశాడని, అయితే సరైన అవకాశం వస్తే తిరిగి ఫామ్ లోకి వస్తాడని అన్నారు. ముఖ్యంగా ఓటీటీ వేదికల ద్వారా తన ప్రతిభను చాటుకోగలడని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తరుణ్ తల్లి రోజా రమణి కూడా తరుణ్ త్వరలో కంబ్యాక్ ఇస్తున్నాడని చెప్పినప్పటికీ, తర్వాత ఇంటర్వ్యూలలో మాత్రం తరుణ్ పూర్తిగా వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
Latest News