|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 12:19 PM
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో జయకృష్ణ సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. మహేశ్ అన్న రమేశ్ బాబు కుమారుడైన జయకృష్ణ, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Latest News