|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 06:50 PM
'మన శంకర వర ప్రసాద్ గారు' ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ట్రోలింగ్‌ను తాను పట్టించుకోనని తెలిపారు. ప్రేక్షకులు సినిమాను చూసి మెచ్చితే ఆదరిస్తారని, లేదంటే తనను తాను సరిదిద్దుకుంటానని అన్నారు. సినిమాను చూడకుండానే విమర్శించే వారిని పట్టించుకోనని, ప్రజల ఆదరణే తన ఎనర్జీకి రహస్యమని ఆయన వెల్లడించారు. జనంలోకి వెళ్లినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తనను ఆప్యాయంగా పలకరించి, సినిమాల గురించి అడగడమే తనకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు.
Latest News