|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 01:43 PM
నటుడు శివాజీ నటించిన 'దండోరా' సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.
Latest News