|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 07:43 PM
నిజామాబాద్ కు చెందిన యాంకర్ శ్రీముఖి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో కథానాయికగా పరిచయమైనా, ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు రాక సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 'జులాయి'లో బన్నీ చెల్లిగా, 'నేను శైలజ'లో రామ్ అక్కగా, 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'లో చిన్న పాత్రలు పోషించింది. అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత, ఇటీవల సమంత నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాలో కీలకపాత్ర పోషిస్తూ, టీజర్ లో తన లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Latest News