|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 04:05 PM
ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ సస్పెన్స్ డ్రామా 'చీకటిలో'. ఈ చిత్రంలో ఆమె సంధ్య అనే పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న నేపథ్యంలో, శోభిత తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సంధ్య పాత్రలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు.తన పాత్ర గురించి వివరిస్తూ, "ఆమె ఒక ముక్కుసూటి అమ్మాయి. స్వతంత్రంగా ఆలోచిస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన నమ్మకాలకు కట్టుబడి ఉంటుంది. ఆమె నిర్ణయాల వెనుక ఒక ప్రత్యేకమైన మొండితనం, దానికి ఒక చరిత్ర కూడా ఉంది" అని శోభిత తెలిపారు. హైదరాబాద్ వీధులు, ఇతర తెలుగు ప్రాంతాల సాంస్కృతిక నేపథ్యం ఉన్న పాత్ర కావడం వల్ల, అందులో సులభంగా ఒదిగిపోగలిగానని ఆమె చెప్పారు."ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎంతో ప్రత్యేకమైనది. 'మేడ్ ఇన్ హెవెన్' నుంచి 'చీకటిలో' వరకు నా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా సాగింది. జనవరి 23న ప్రైమ్ వీడియోలో సినిమా విడుదలయ్యాక, సంధ్యగా నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు" అని శోభిత ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News