|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 01:48 PM
వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ నటి గీతా సింగ్, తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర విషాదాలను, కన్నీటి గాథలను తాజాగా పంచుకున్నారు. ఒకవైపు కెరీర్‌లో `కితకితలు` వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో రాణిస్తున్నప్పుడే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఊహించని కష్టాలు తనను కుంగదీశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కష్టసుఖాలను పంచుకున్నారు.తన సోదరుడు అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో, ఆయన పిల్లల బాధ్యతను తానే స్వీకరించినట్లు గీతా సింగ్ తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తాను పెళ్లి కూడా చేసుకోలేదని వెల్లడించారు. తన సొంత బిడ్డల్లాగే వారిని పెంచుకున్నానని, ముఖ్యంగా దత్తపుత్రుడిని తన ప్రాణంగా భావించానని ఆమె అన్నారు. అయితే, విధి ఆడిన వింత నాటకంలో ఆ కొడుకు ఓ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడం తన జీవితంలో అతిపెద్ద విషాదమని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో పాటు తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల మరణాలు తనను మానసికంగా కుంగదీశాయని, డిప్రెషన్‌లోకి వెళ్లి చాలా కాలం సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.అయితే, తన కష్టకాలంలో బంధువులెవరూ అండగా నిలవలేదని గీతా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు అందరూ తన చుట్టూ ఉండేవారని, కానీ కొడుకు మరణించిన 11వ రోజు నుంచి తనను పలకరించడానికి కూడా ఎవరూ రాలేదని వాపోయారు.
Latest News