|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 03:32 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 'ది రాజాసాబ్'కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్ల పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ... నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా స్క్రిప్ట్ బలహీనంగా ఉందని, స్టోరీ డ్రాగ్ అవుతోందని, జానర్ల మధ్య కనెక్షన్ లేదని పలువురు క్రిటిక్స్, ఆడియన్స్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రివ్యూలు కూడా 1.5 నుంచి 3 స్టార్ల మధ్యే ఉన్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఓపెనింగ్ డే ప్రీమియర్లతో కలిపి రూ.100 కోట్లు దాటేసింది. మొదటి వీకెండ్ లోపల ఇండియాలో రూ.100+ కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.150-160 కోట్లు దాటాయి. నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.
Latest News