|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 12:34 PM
దర్శకుడు అనిల్ రావిపూడి తన తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' స్క్రిప్ట్ ను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశానని వెల్లడించారు. ఇది తన కెరీర్ లోనే అత్యంత వేగవంతమైన రచన అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే ఇంత తక్కువ సమయంలో స్క్రిప్ట్ రాయగలిగానని, ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో భారీ విజయం సాధించిన అనిల్, ఈ సంక్రాంతికి చిరంజీవితో మరో హిట్ పై కన్నేశారు.
Latest News