|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 03:33 PM
తమిళ స్టార్ ధనుష్, ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. గత ఏడాది మూడు భాషల్లో సినిమాలు చేసిన ఆయన, 'కర' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'పోర్ తోజిల్' ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. టీజర్‌లో ధనుష్‌ది ఇప్పటివరకు చేయని కొత్త రోల్ అని, మట్టి వాసనతో కూడిన కథనం, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Latest News