|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 03:31 PM
నటి తమన్నా భాటియా నటించిన 'ఆజ్ కీ రాత్' పాట యూట్యూబ్‌లో 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. గతేడాది విడుదలైన 'స్త్రీ 2' చిత్రంలోని ఈ పాటలో తమన్నా డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా తమన్నా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తమన్నా, 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 'హ్యాపీ డేస్', 'బాహుబలి', 'ఓదెల 2' వంటి చిత్రాలతో పాటు పలు స్పెషల్ సాంగ్స్‌లోనూ తమన్నా తనదైన ముద్ర వేశారు.
Latest News