|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 05:35 PM
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సారా అర్జున్, బాలీవుడ్ లో 'ధురంధర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న 'యుఫోరియా' సినిమాలో నటిస్తున్న ఆమె, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు, తనకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని సారా అర్జున్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News