|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 10:22 AM
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎక్కువ కాలం ఉండదు. కానీ స్టార్ హీరోయిన్ నయనతార 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తూ, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల 'మన శంకర్ వరప్రసాద్' సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా, ఆమె నటించిన 'తులసి', 'విశ్వాసం', 'మన శంకర్ వరప్రసాద్'.. ఈ మూడు సినిమాలు ఒకే కథాంశంతో తెరకెక్కాయి. తండ్రి-కొడుకులు లేదా భార్యాభర్తలు విడిపోయి, తిరిగి కలవడమే ఈ సినిమాల కథ. విచిత్రమేంటంటే, ఈ మూడు సినిమాలూ ఘన విజయం సాధించాయి. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
Latest News