![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 12:03 PM
యంగ్ హీరోలు ఏం చేసినా... జనాలు పెద్దంత పట్టించుకోరు. కానీ సీనియర్ స్టార్స్... అందులోనూ ప్రజలలో మంచి గుడ్ విల్ ఉన్న వారు పాటలో వేసే స్టెప్స్ గురించిన విమర్శలు ఎక్కువ వస్తాయి. గతంలో చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తూ 'ఖైదీ నెంబర్ 150' లో 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు' అనే పాటలో కాజల్ ఛాతీ మీద చిరంజీవి చేతితో గుద్దడాన్ని కొందరు తప్పుపట్టారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టరే... 'డాకు మహారాజ్' లో ఊర్వశీ రౌతేలా సాంగ్ లో బాలకృష్ణ తో వేయించిన మూమెంట్స్ విమర్శకు గురయ్యాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ సాంగ్ కూడా ఒకటి విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యింది. 'రాబిన్ హుడ్' మూవీలోని 'అది దా సర్ ప్రైజ్' అనే పాటలో కేతికా శర్మ స్కర్ట్ ను ముందుకు లాగుతూ వేసిన స్టెప్సు చూసి కుర్రకారు సైతం నోరు తెరిచారు. ఎంత ఐటమ్ సాంగ్ అయినా ఇలాంటి స్టెప్స్ ఎలా వేయిస్తారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యాన్ని కూడా తప్పు పట్టారు. ఇప్పటి వరకూ హీరోయిన్ గా నటించిన కేతికా శర్మ... మొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది. అయితే హీరోయిన్ గా నటించినా, ఐటమ్ గర్ల్ గా నటించిన అందాల విందుకు తాను సై అని మరోసారి కేతిక నిరూపించుకుంది.
Latest News