![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 11:49 AM
కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌రుబా’. విశ్వకరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకే్‌షరెడ్డి... సారెగమ సంస్థతో కలసి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘మీరు నాపై చూపే అభిమానానికి రుణపడి ఉంటాను. ఇకపై మీ అందరూ గర్వపడే సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకునే ఔత్సాహికులకు నా వంతు సాయం చేస్తా. ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ ఏడాది ‘హోలీ’ని థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుందాం. సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇదో క్లీన్ కమర్షియల్ సినిమా. సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేను కానీ మీరు కోరుకున్న వినోదం అయితే కచ్చితంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలోని ప్రతీ అంశం మీ అందర్నీ అలరిస్తుంది. విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అని విశ్వకరుణ్ అన్నారు. ‘‘ఈ సినిమాలో అంజలి అనే పాత్రలో నటించా. ఇలాంటి విభిన్న షేడ్స్ ఉన్న రోల్ దొరకడం నా అదృష్టం’’ అని హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ తెలిపారు. ‘‘ఈ సినిమాతో టీమ్ అందరికీ సక్సెస్ పక్కా’’ అని చిత్రనిర్మాత రాకేష్ రెడ్డి అన్నారు.
Latest News