by Suryaa Desk | Tue, Dec 24, 2024, 04:47 PM
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు సూర్య తన రాబోయే చిత్రం సూర్య 44 (తాత్కాలిక టైటిల్) సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. సాంకేతిక సిబ్బంది కెమెరాను శ్రేయాస్ కృష్ణ మరియు ఎడిటింగ్ షఫీక్ మహమ్మద్ అలీ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు జాకీ నేతృత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, సినిమా టైటిల్ టీజర్‌ను క్రిస్మస్ పండుగ రోజున అంటే డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార కంటెంట్ ఆశాజనకంగా ఉంది మరియు ఇప్పుడు అందరి దృష్టి ఈ టైటిల్ టీజర్‌పై ఉంది. సూర్య44 యాక్షన్ అంశాలతో కూడిన ప్రేమకథ. ఈ చిత్రం ఇంటెన్స్ మరియు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. జయరామ్, కరుణాకరన్ మరియు జోజు జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Latest News