by Suryaa Desk | Mon, Aug 12, 2024, 06:12 PM
దోమ.. పేరు చిన్నదే. కానీ.. దాని కాటుతో ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. వానాకాలం వస్తే చాలు విజృంభిస్తూ మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. ఎన్ని రకాల కాయిల్స్ వాడినా, చివరికి తెరలు కుట్టుకున్నా ప్రయోజనం లేదంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. శుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు.