మెతుకు సీమ తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది, జహీరాబాద్ లోక్‌సభ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4వరకు వేచిచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa