పన్నుల బకాయిపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో గల గ్రామ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, పట్టణంలో లక్షలాది రూపాయల పన్నులు పేరుకుపోయాయని చెప్పారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా వసూలు చేయాలని సూచించారు. బకాయి ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa