నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చాలంటు బిజెవైఎం మండల నాయకులు అజయ్ ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa