ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లింగాపూర్ లో మొక్కలు నాటిన విప్ అడ్లూరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 02:45 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని పెగడపెల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa