కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ తండా నుంచి వస్తున్న బైక్ ను ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి గురువారం ఉదయం ఆపి తనిఖీ చేయగా 6 లీటర్ల నాటు సారా తరలిస్తున్నట్లు గుర్తించి హర్యాను అరెస్ట్ చేశామని తెలిపారు. వెల్దండ మండలం కళ్యాణ వాస తండా, పిల్లికండ్ల తండాల్లో దాడులు చేసి 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం సి. ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నాటు సార కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa