భోనాల వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు.ఈరోజు 132-జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లోని శ్రీ కామరాతి సమేత బీరప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రావణమాస బోనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తూ అందరిచే పూజలు అందుకుంటున్న "కామరాతి సమేత బీరప్ప స్వామి"దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నార్లకంటి నాగేష్, ప్రెసిడెంట్ ఎన్.చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి గొరిగె మహేందర్, జి.యాదయ్య, కుంటి మల్లేష్, నార్ల కంటి ప్రతాప్, గొరిగే యాదయ్య, గొరిగే సత్తయ్య, రమేష్, నార్ల కంటి దుర్గయ్య, గొరిగే బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa