భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేసింది ఎర్రజెండానే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ అన్నారు. మంగళవారం కంగ్టి లో జరిగిన సిపిఎం కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ హాజరై మాట్లాడుతూ...1946 నుండి 1951 వరకు చారిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేకమంది అమరవీరులు నేలకొరిగారని అన్నారు. ఆ అమరవీరుల వారసత్వాన్ని ముందుకు తీసుక పోవడం కోసం సీపీఎం కృషి చేస్తుందని చెప్పారు. ఆ పోరాటానికి కమ్యూనిస్టు యోధులు నాయకత్వం వహించి తుపాకీ ఎక్కు పెట్టి పోరాడిన్నారు ఆ పోరాటం అంతా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన పోరాటమని గుర్తు చేశారు.సాయుద పోరాటమంతా భూమి,భుక్తి, విముక్తి కోసమే చేశారని పేర్కొన్నారు.
సాయుధ పోరాటంలో ఎర్రజెండా ముద్దుబిడ్డలు కమ్యూనిస్టు కార్యకర్తలు సుమారు 4000 మంది అమరులయ్యారని 10లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని మూడువేల గ్రామాల్లో ప్రజారాజ్యాలు ఏర్పడ్డాయని చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో నైజాం నవాబు నెహ్రూ యూనియన్ సైన్యాలకు కబురు పంపి లొంగి పోయారని అన్నారు. అలాంటి వెట్టికి వ్యతిరేకంగా అనేకమంది పోరాటాలు చేయడంతో విముక్తి జరిగిందని గుర్తు చేశారు.అనంతరం యూనియన్ సైన్యాలు అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నాటి తెలంగాణ ప్రాంతాన్ని నైజాం భారతదేశంలో విలీనం చేసిన తర్వాత సాయుధ పోరాటం ద్వారా పంపిణీ చేసిన భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత కమ్యూనిస్టులదే అని అన్నారు. నాటి పోరాటస్ఫూర్తిని నింపేందుకే కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారనిగుర్తు చేశారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ జరిగే ఉద్యమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమం సిపిఎం నారాయణఖేడ్ ఏరియా కమిటీ ఇంచార్జీ నల్లవల్లి రాజేష్ కంగ్టి మండల సిపిఎం ప్రజా సంఘాల నాయకులు సంగ్రామ్ సతీష్ పవన్ సురేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa