తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa