ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ, 12న దసరా: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 07:50 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను అక్టోబర్ 10వ తేదీన, దసరా పండుగను అక్టోబర్ 12వ తేదీన నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్చెరు రామాలయంలో నిర్వహించిన పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa