బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవటానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
'నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆరే. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశాడు. హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకోని వెళ్లిపోవటానికి కేటీఆర్ కారణం. వారి జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడు. ఈ విషయం టాలీవుడ్‌లోని పెద్దలందరికీ తెలుసు. దొంగ ఏడుపులు ఏడవటానికి నాకేం అవసరం. కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి, కూతురు లేరా?' అని ఆమె ప్రశ్నించారు.
బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారని ఆరోపించారు. గతంలో గిరిజన మహిళా మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెట్టించారని విమర్శించారు. ఇప్పుడు బీసీ మహిళైన తనను కూడా కించపరుస్తూ పోస్టులుపెట్టడం బాధాకరమని వాపోయారు. తనపై పెట్టిన పోస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా థృక్పతంతో స్పందించారు. కేటీఆర్‌కు ఆ మాత్రం సోయి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, నిన్నమొన్నటి వరకు సినీ పరిశ్రమ వరకే పరిమితమైన సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. వారిద్దరూ విడాకులు తీసుకొని దాదాపు మూడేళ్లు గడుస్తోంది. సమంత సినిమాలతో బిజీ కాగా.. నాగచైతన్య రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయనకు నిశ్చితార్థం కూడా అయింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇదిలా సాఫీగా వారి జీవితాలు సాగుతున్న క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్‌తో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa