ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుటుంబ వ్యవహారాలు, వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు అని వివరించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఈ దేశంలో ఎవరికి లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa