ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 08:44 PM

మూసీలో ఆక్రమణల తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాక పుట్టిస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార.. విపక్ష నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందించారు. భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్‌ విసిరారు.‘‘సీఎం రేవంత్‌ పాలన బాగుందని ప్రజలు అంటే.. రాజకీయల నుంచి తప్పుకొంటా. సీఎం మంచిపని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తా. ఉప్పల్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట ఎక్కడికి వస్తారో సీఎం చెప్పాలి. హరీశ్‌రావు రాసిస్తే నేను మాట్లాడతానని అనడం అవగాహన రాహిత్యం’’ అని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa