ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవాకు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 08:35 PM

ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు  వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్‌ - వాస్కోడిగామా రైలు సర్వీసును  ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్లు ఉండగా.. ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అక్టోబర్ 6న సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందిసికింద్రాబాద్‌ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు 17039 నంబర్‌తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు 17040 నంబర్‌తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.


కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్‌ స్టేషన్లలో ఆగుతుందిఇందులో ఫస్ట్‌ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa