విజ్ఞాన్‌పూరి కాలనీలో రోడ్డు పనులను వేగవంతం చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కాలనీలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా పూర్తిచేయాలని, రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఈఈ గోవర్ధన్, స్థానిక నేతలు సంతోష్, ప్రభాకర్, కాలనీ వాసులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa