ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్‌లో దారుణం.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 10:17 PM

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి చివరకు ఆమెను గర్బవతిని చేశాడు. ఈ దారణ ఘటన గీసుగొండ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్లపై బాలికపై పక్కింట్లో ఉండే వృద్ధుడు కన్నేశాడు. భార్య చనిపోవటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధుడు బాలికపై కన్నేశాడు. ఇంటికి దగ్గర ఆడుకుంటున్న సదరు బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు.


ఇటీవల బాలిక ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పింది. పక్కింట్లో ఉండే వృద్ధుడే తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చటం స్థానికంగా చర్చనీయాంశమైంది.


కాగా, రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోనూ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. కారు, జేసీబీ వాహనం, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారికి నచ్చజెప్పిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యాచారం చేసిన నిందితుడికి శిక్షపడేలా చూస్తామని చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa