ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కి కృషి చేస్తా...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:45 PM

చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ లోని సిరి గార్డెన్ లో కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి TGIICC చైర్మెన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ...నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఇండస్ట్రియల్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీర్అర్ఎస్  పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు,పావని రెడ్డి, TIF ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, గోపాల్ రావు IAIA కమిషనర్ ప్రభాకర్ , స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నూతన అధ్యక్షుడు యాదయ్య, ఉపాధ్యక్షుడు మచ్చ అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, దామోదర్ చారి కమిటీ సభ్యులు ,బీర్అర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa